CM Revanth: ఆడబిడ్డలను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తారా : బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్

అసెంబ్లీలో ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2024-08-01 08:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ నాయకులు రాజకీయాలు చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు. సభ జరగకుండా అడ్డుTeపడుతున్న బీఆర్ఎస్ నాయకులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభలో ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన విపక్షం ఎందుకు ఇలా వ్యవహరిస్తోందో అర్థం కావడం లేదని అన్నారు. ఆడబిడ్డలను, అక్కలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారా అని ధ్వజమెత్తారు. ఒక అక్క తనను నమ్మించి నడి బజారులో వదిలేసిందని, మరో అక్క అక్క తనపై రెండు కేసులు పెట్టిందని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

CM Revanth: ఆడబిడ్డలను అడ్డు పెట్టుకుని రాజకీయం ఏంది: బీఆర్ఎస్‌పై సీఎం రేవంత్‌రెడ్డి ఫైర్ఇప్పటికీ తాను కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నానని అన్నారు. ఇప్పటికీ వారిని నేను సొంత అక్కలుగానే భావిస్తున్నానని సీఎం తెలిపారు. తనకు మహిళల పట్ల అపారమైన గౌరవం ఉందని, మంత్రి సీతక్కను తాను ఓ కుటుంబ సభ్యురాలిగా చూసుకుంటానని గుర్తు చేశారు. కానీ, తమ్ముడిని నమ్మించిన అక్కలు మాత్రం పదవులు పొంది మంత్రులు అయ్యారంటూ కామెంట్ చేశారు. సొంత చెల్లెలు ప్రస్తుతం జైలులో ఉందని, ఆ చెల్లెలు గురించి మాత్రం ఎవరూ ఎక్కడా మాట్లాడరని చురకలంటించారు. ఆనాడు ఓ దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన పెద్ద మనిషి.. ఆ వర్గానికి చెందిన వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి బర్తరఫ్‌ చేశా సీఎం రేవంత్‌‌రెడ్డి ఫైర్ అయ్యారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..