‘డిప్యూటీ CM పోస్ట్ ఇచ్చి పక్కనే కుర్చొబెట్టుకుంటా’.. MIM ఎమ్మెల్యేకు రేవంత్ సంచలన ఆఫర్
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట
దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్‌పై కొడంగల్ నియోజవర్గం నుండి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని రేవంత్ హామీ ఇచ్చారు. చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి అక్బరుద్దీన్‌ను గెలుపు కోసం కృషి చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్‌కు డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చి అసెంబ్లీలో నా పక్కనే కూర్చొబెట్టుకుంటానని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా రేవంత్ పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు అసెంబ్లీ సెషన్ హాట్ హాట్‌గా సాగుతోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో అసెంబ్లీ హాల్ దద్దరిల్లుతోంది.