Revanth Reddy: అజాత శత్రువు, అపర చాణక్యుడు రోశయ్య.. సీఎం ఘన నివాళులు
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోషయ్య వర్ధంతి(Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘన నివాళులు(Paid Tribute) అర్పించారు.
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం రోషయ్య వర్ధంతి(Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘన నివాళులు(Paid Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ లో ఆయన ఫోటోతో కూడిన ప్రత్యేక పోస్ట్ పెట్టారు. ఇందులో రోషయ్యను అజాత శత్రువు, అపర చాణక్యుడు అని రేవంత్ రెడ్డి కొనియడారు. దీనిపై స్వతంత్ర సమరయోధుడు(Freedom Fighter), ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి(United AP Former CM), మాజీ గవర్నర్(Former Governor) కొణిజేటి రోశయ్య(Konijeti Roshayya) గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అని సీఎం రాసుకొచ్చారు. కాగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న రోషయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పలు కీలక పదవుల్లో పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా 15 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోషయ్య.. వరసగా ఏడుసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించాడు. అంతేగాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు(Tamil Nadu), కర్ణాటక(Karnataka) రాష్ట్రాల గవర్నరుగా కూడా పనిచేశారు.