Vivek Venkata Swamy: సీఎం కేసీఆర్ తెలంగాణ రాజపక్స : వివేక్ వెంకట స్వామి
CM KCR Takes Number 1 Place In Corruption, Says Vivek Venkata Swamy| రాష్ట్రంలో కుటుంబ పాలన, ప్రాజెక్టులలో అవినీతి, కేంద్రం నిధుల మళ్లింపులో కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలిచారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గొడిశేల వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల
దిశ,కాటారం : CM KCR Takes Number 1 Place In Corruption, Says Vivek Venkata Swamy| రాష్ట్రంలో కుటుంబ పాలన, ప్రాజెక్టులలో అవినీతి, కేంద్రం నిధుల మళ్లింపులో కేసీఆర్ నెంబర్ వన్‌గా నిలిచారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గొడిశేల వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరో రాజపక్సే కేసీఆర్ అని మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ సొంతంగా తయారుచేసిన డిజైన్‌తో నిర్మించడం వల్లే అవినీతి జరిగిందని, మూడేళ్లు గడిచినా ఆ ప్రాజెక్ట్ నుంచి ఒక్క చుక్క నీరు వ్యవసాయానికి అందలేదని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అవినీతికి పాల్పడటమే కాకుండా, ఇంజనీర్లు చేయాల్సిన డిజైన్‌ను కేసీఆర్ ఇంట్లో కూర్చొని రీ డిజైన్ చేసినందుకు కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలని వివేక్ డిమాండ్ చేశారు.
డిస్కవరీ చానల్ నుండి ఎందుకు తొలగించారు
కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని ప్రపంచంలో ఎక్కడా లేదని చెబుతూ డిస్కవరీ చానల్‌లో చేయించిన ముఖ్యమంత్రి వారం రోజుల క్రితం ఇదే డిస్కవరీ చానల్ నుండి ఈ ప్రాజెక్టు వీడియో తొలగించారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. స్వతంత్ర దినోత్సవం రోజున జరిగిన వజ్రోత్సవ వేడుకల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఒక మాట మాట్లాడకపోవడం అతను తన తప్పును ఒప్పుకున్నట్లు అయిందని వివేక్ ఆరోపించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన గృహాలను కేసీఆర్ రాష్ట్రంలో మంజూరు చేయకుండా నిర్లక్ష్యం చేశారని, కేంద్రం నుండి మంజూరైన 16 లక్షల ఇళ్ల నిధులను ప్రాజెక్టులకు డైవర్ట్ చేశారని వివేక్ ఆరోపించారు.
ప్రాజెక్టుల ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
కేసీఆర్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులకు వెచ్చించిన నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని వివేక్ వెంకటస్వామి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. కమీషన్ల కక్కుర్తి కోసం ప్రజల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. 5 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రభుత్వ సంస్థలన్నీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను ఇష్టం వచ్చినట్లు వాడుకోవడం ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై రాళ్ల దాడి చేయడం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. సంజయ్ పై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని, టీఆర్ఎస్ ను క్లీన్ స్వీప్ చేస్తామని వివేక్ వెంకటస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తిరెడ్డి, మంథని ఇన్చార్జి చందుపట్ల సునీల్ రెడ్డి, నాయకులు దుర్గం తిరుపతి, బొమ్మన భాస్కర్ రెడ్డి, శ్రీమన్ నారాయణ, పిల్లమరి సంపత్, మలక మోహన్రావు ,అంకయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై డీజీపీ, ఎన్‌హెచ్ఆర్సీకి ఫిర్యాదు