కమ్యూనిస్టులకు సీఎం కేసీఆర్ ఝలక్!.. నేడు వామపక్షాల కీలక సమావేశం
పొత్తు అంశం ప్రస్తావన లేకుండానే సీఎం కేసీఆర్ 115 అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: పొత్తు అంశం ప్రస్తావన లేకుండానే సీఎం కేసీఆర్ 115 అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. మునుగోడు ఎన్నికల సందర్భంగా వామపక్షాలు గులాబీ పార్టీకి మద్దతు తెలిపాయి. ఇక, వామపక్ష పార్టీలతో పొత్తు లేదని సీఎం కేసీఆర్ తేల్చేసిన నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు నేడు కీలక సమావేశం జరగనుంది. భవిష్యత్ కార్యచరణపై సీపీఐ, సీపీఎం చర్చించనున్నాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేసే ఆలోచనలో సీపీఐ, సీపీఎం ఉన్నట్లు తెలిసింది. ఈ సమావేశానికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ముఖ్యనేతలు హాజరు కానున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్ కార్యచరణపై భేటీలో చర్చించనున్నారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం, పాలేరు టికెట్లను వామపక్షాలు కోరాయి.