నేడు రోడ్డుమార్గం ద్వారా యాదాద్రికి CM KCR
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సోమవారం సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 7500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సోమవారం సీఎం కేసీఆర్ పరిశీలించనున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దామరచర్లలో 7500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. దీనిని 2015 జూన్ 8న కేసీఆర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా టీఎస్ జెన్ కో, బీహెచ్ఈఎల్ సంయుక్త ఆధ్వర్యంలో సుమారు 55వేల కోట్లతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం చేపడుతున్నారు. ఈ పనులను పరిశీలించేందుకు ఈ నెల 12న కేసీఆర్ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేయగా, అదే రోజూ పీఎం మోడీ రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు వచ్చారు. దీనితో సీఎం రోడ్డుమార్గం ద్వారా వెళ్లేందుకు అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ అనుమతి రాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. దీంతో తిరిగి సోమవారం పర్యటనకు వెళ్తున్నారు. ఉదయం ప్రగతి భవన్ నుంచి బయల్దేరి 10.30 గంటల వరకు పవర్ ప్లాంట్ నిర్మాణ స్థలికి కేసీఆర్ చేరుకోనున్నారు. సీఎం వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఉంటారు. ప్లాంట్ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయనున్నారు.
Read More...