ధరణి వద్దంటున్న కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో వేయాలి: సీఎం కేసీఆర్
రైతుబంధు కింద రైతులకు ఇచ్చే సొమ్ము వృథా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. రైతుల కోసం తీసుకువచ్చిన రైతు బంధు పథకాన్ని వద్దనే వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్
దిశ, వెబ్‌డెస్క్: రైతుబంధు కింద రైతులకు ఇచ్చే సొమ్ము వృథా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.. రైతుల కోసం తీసుకువచ్చిన రైతు బంధు పథకాన్ని వద్దనే వాళ్లకు ప్రజలే బుద్ధి చెప్పాలని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు విత్తనాలు, ఎరువుల కోసం రైతుల ఇబ్బంది పడేవారు.. కానీ రైతుబంధు సొమ్ముతో రైతులకు పెట్టుబడి కష్టం తీరిందనన్నారు. రైతు బంధు వద్ద అన్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలన్నారు. ధరణి పోర్టల్ తీసేస్తే మళ్లీ లంచాలు, దళారీ వ్యవస్థ వస్తుందని.. ధరణి వద్దు అన్న వాళ్లను బంగాళాఖాతంలో వేయాలని అన్నారు. శుక్రవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద్ సభలో పాల్గొని కేసీఆర్ ప్రసంగించారు. ప్రాణాలకు తెగించి నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించానని.. తెలంగాణ వచ్చింది కాబట్టే మహబూబాబాద్‌ను జిల్లా చేసుకున్నామని అన్నారు. జిల్లా కావడంతో మహబూబాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయన్నారు.