రేవంత్ ఎఫెక్ట్.. మునుగోడు రూట్ మ్యాప్ చేంజ్ చేసిన కేసీఆర్?
దిశ, చౌటుప్పల్: మునుగోడు లో నిర్వహించనున్న ప్రజా దీవెన సభకు కేసీఆర్ కాన్వాయ్ చౌటుప్పల్ మీదుగా నారాయణపురం మండలం మునుగోడు
దిశ, చౌటుప్పల్: మునుగోడు లో నిర్వహించనున్న ప్రజా దీవెన సభకు కేసీఆర్ కాన్వాయ్ చౌటుప్పల్ మీదుగా నారాయణపురం మండలం మునుగోడు సభాస్థలికి చేరుకొనున్నట్లు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఏం జరిగిందో తెలియదు గానీ కేసీఆర్ కాన్వాయ్ చౌటుప్పల్ నుంచి చిట్యాల, నార్కట్ పల్లి మండలాల నుంచి బ్రాహ్మణ వెల్లంల మీదుగా మునుగోడు చేరుకొనున్నట్లు తెలుస్తుంది. సీఎం కేసీఆర్ కాన్వాయ్‌లో సుమారు నాలుగు వేల వాహనాలు ఉండనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంస్థాన్ నారాయణపురం మండలం పొర్లగడ్డ తండాలో రేవంత్ రెడ్డి పర్యటన ఉండడంతో సీఎం కేసీఆర్ కాన్వాయ్‌కి ఇబ్బంది ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే రూటు మార్చినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండలో భూ సమస్యలు ఎదుర్కొంటున్న గిరిజనులు కేసీఆర్ సభను అడ్డుకుంటామని హెచ్చరించడంతో ఎక్కడ కాన్వాయ్‌కి అడ్డుపడుతారో అనే రూట్ చేంజ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే కేసీఆర్ కంట్లో పడడానికి ఎమ్మెల్యే ఆశావాహులు లక్షలు ఖర్చుపెట్టి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు వారంతా లక్షలు ఖర్చు పెట్టి ఫ్లెక్సీలు కట్టిస్తే ప్రయోజనం లేకుండా పోయిందని నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి :