అధిష్టానం గ్రీన్ సిగ్నల్.. భట్టి విక్రమార్క పాదయాత్ర తేదీలు ఖరారు
ఎట్టకేలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కన్ఫామ్అయింది.ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర కన్ఫామ్ అయింది. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నది. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు కొనసాగించనున్నారు. 39 నియోజకవర్గాలలో 91 రోజుల పాటు పాదయాత్ర జరగనున్నది. ఢిల్లీ అధిష్టానం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడం గమనార్హం. అయితే ఇప్పటికే మహేశ్వర్‌రెడ్డి బైంసా నుంచి తెలంగాణ పోరు యాత్రను ప్రారంభించగా, దాన్ని భట్టి చేసే యాత్రలో విలీనం చేయనున్నారు. అంటే షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్‌తో ముగియాల్సిన మహేశ్వర్‌రెడ్డి యాత్ర ఖమ్మం వరకు కంటిన్యూ కానున్నది. ఇది భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది. అయితే గతంలో ఉన్న షెడ్యూలును మార్పులు చేస్తూ ఎక్కువ ప్రాంతాలు కలిసేలా ప్రణాళికను రూపకల్పన చేశారు. ఈ ఈ యాత్రకు సీనియర్లంతా మద్ధతు తెలిపారు.
1365 కిలోమీటర్లలో..
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్రను డిజైన్ చేశారు. బీఆర్ఎస్ఇచ్చిన హామీలు, చేయలేని పనులన్నింటినీ భట్టి పాదయాత్రలో ఇంటింటికి వివరించనున్నారు. దీంతో పాటు నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న జాప్యం, ప్రాజెక్టులపై అక్రమాలు వంటివన్నీ భట్టి ఆధ్వర్యంలో ప్రజలకు చేరవేయాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ పాదయాత్ర చేస్తుండగా, మహేశ్వర్‌రెడ్డి కూడా మరో యాత్ర చేస్తున్నారు.
దీనికి అదనంగా భట్టి మొదలు పెడుతుండటం, కోమటి రెడ్డి తాను కూడా చేస్తానని ప్రకటించడంతో కాంగ్రెస్‌పార్టీ కేడర్‌లో కన్ఫ్యూజన్ నెలకొన్నది. పార్టీ ప్రజల్లోకి ఫోకస్వస్తున్నప్పటికీ, కార్యకర్తల్లో వర్గఫోరు మొదలైందని క్షేత్రస్థాయిలో చర్చించుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క శనివారం గాంధీభవన్‌లో మాట్లాడుతూ..పాదయాత్రలో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయన్నారు. కాంగ్రెస్‌పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఖర్గే ఆదేశాలతోనే పాదయాత్ర చేస్తున్నానని పేర్కొన్నారు.