ఎంపిహెచ్ఎ ఫిమేల్ నోటిఫికేషన్ రద్దు చేయాలి.. సీఐటీయూ డిమాండ్
రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ పోస్టులు భర్తీ కోసం బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు భూపాల్, పసియుద్దీన్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫిమేల్ పోస్టులు భర్తీ కోసం బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు భూపాల్, పసియుద్దీన్ లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లో పేర్కొన్న నియమ నిబంధనల వల్ల కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని వారు పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న 1520 ఎంపీహెచ్ఏ ఫిమేల్ పోస్టులలో సీనియార్టీ ప్రకారం కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఎంపీహెచ్ఏ ఫిమేల్ ఉద్యోగులను యధావిధిగా రెగ్యులరైజెషన్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఏఎంఎంలను రెగ్యులర్ లను చేయకుండా కొత్తగా నోటిఫికేషన్నో వేయడాన్ని వారు తప్పుబట్టారు. ఈ మేరకు గురువారం కాంట్రాక్ట్ ఏఎన్ఎం పి హెచ్ సి ల వద్ద నిరసన కార్యక్రమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో సెకండ్ ఏఎన్ఎంలు, ఈసీ, అర్బన్ సెంటర్ ఏఎన్ఎంలు అనేక సంవత్సరాలుగా సర్వీస్ చేస్తూ ఉన్నారని వారినందరిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.