భారీ వర్షంలో రేవంత్ రెడ్డి.. పదేళ్లుగా కేసీఆర్ వర్షంలో బయటకు వచ్చారా? (వీడియో)
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోరువానలో వర్ష ప్రభావిత ప్రాంతాలను తనిఖీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినట్లు సమాచారం.
దిశ, డైనమిక్ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోరువానలో వర్ష ప్రభావిత ప్రాంతాలను తనిఖీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లినట్లు సమాచారం. పదేళ్లు సీఎంగా ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏనాడైనా ఇలా వర్షంలో బయటకు వచ్చారా? అని కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీ వర్షంలో రేవంత్ రెడ్డి కాన్వాయ్ సచివాలయానికి వెళ్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే, హైదరాబాద్‌లో కుండ పోత వర్షం పడటంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు వర్షం పడుతున్న ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. సచివాలయం నుంచి అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.