బీపీ, డయాబెటిస్ లాంటివి తగ్గించే పౌడర్! భారీగా స్టాక్ సీజ్ చేసిన డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్లు
హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారలు తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో డ్రగ్ కంట్రోల్ అధికారలు తనిఖీలు చేపడుతున్నారు. తాజాగా హైదరాబాద్ గోల్కొండలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు నిర్వహించారు. మొహల్లా గంజ్‌లోని హిక్మా సెహత్ కేర్‌లో తనిఖీ చేసి సాహెత్ కేర్ పౌడర్‌ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు చాంద్రాయణగుట్ట, బండ్లగూడలో అమ్మకానికి ఉన్న 1లక్ష 2 వేల స్టాక్‌ను అధికారులు సీజ్ చేశారు. డయాబెటిస్, బీపీ, షుగర్ లాంటివి ఉన్నవాళ్లకు చికిత్సకు ఉపయోగపడుతుందని అమ్మకాలు చేపట్టారని అధికారులు తెలిపారు. మొహల్లా గంజ్‌లో 60 సాహెత్ కేర్ పౌడర్ డబ్బాలు అధికారులు సీజ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇల్లీగల్ డ్రగ్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని డ్రగ్ కంట్రోల్ అధికారులు హెచ్చరించారు.