Chandrayaan-3: ఇస్రో మరో కీలక ప్రకటన

చంద్రయాన్ - 3 ప్రయోగంలో భాగంగా నేడు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టనుంది.

Update: 2023-08-23 08:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: చంద్రయాన్ - 3 ప్రయోగంలో భాగంగా నేడు విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇస్రో మరో కీలక ప్రకటన చేసింది. చంద్రుడి ఉపరితలంపై దిగేందుకు ల్యాండింగ్ మాడ్యూల్‌ను మార్చినట్లు ప్రకటించింది. చంద్రుడి ఉపరితలంపై సాధారణ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. నిర్దేశిత సమయం కన్నా ముందే విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ కానున్నట్లు ప్రకటించింది. సోలార్ విండ్ స్థిరంగా ఉందని ఇస్రో తెలిపింది. సాయంత్రం 5.44 గంటలకు ల్యాండింగ్ ప్రక్రియ కానున్నట్లు వెల్లడించింది. 6.04 గంటలకే చంద్రుడిని విక్రమ్ ల్యాండర్ తాకనున్నట్లు తెలిపింది. ల్యాండర్ 12 డిగ్రీలు ఒరిగిన సేఫ్‌గా దిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. సాయంత్రం 5.47 తర్వాత ల్యాండర్ తన పని తాను చేసుకుంటుందని అధికారులు తెలిపారు.

Tags:    

Similar News