Chamala: మద్యానికి మీరే బ్రాండ్ అంబాసిడర్‌లు.. కేటీఆర్‌కు ఎంపీ చామల కౌంటర్

కేటీఆర్ మద్యం గురించి మాట్లాడుతుంటే సమాజం నవ్వుకుంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

Update: 2024-10-19 08:17 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: కేటీఆర్ మద్యం గురించి మాట్లాడుతుంటే సమాజం నవ్వుకుంటుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. మద్యంపై ఉన్న ద్యాస మద్దతు ధరపై లేకపాయే అంటూ మద్యం ధరల పెంపుపై కేటీఆర్ ట్వీట్ చేశారు. దీనిపై ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చిన చామల కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం గురించి నువ్వు మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది కేటీఆర్ అని, దేశ స్థాయిలో మద్యానికి నీ అయ్య నీ కుటుంబం బ్రాండ్ అంబాసిడర్ లు అనే సంగతి మరిచిపోయినవా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నువ్వు పెట్టిన ట్వీట్.. మతి తప్పి నీ అయ్య గురించి నువ్వే చెప్పినట్లు ఉందని ఎద్దేవా చేస్తూ రాసుకొచ్చారు.

కాగా మద్యం ధరల పెంపుపై కేటీఆర్.. మద్యంపై ఉన్న ధ్యాస.. మద్దతు ధరపై, మంచి బోధనపై, మందు బిళ్లలపై, మూసి బాధితులపై, మంచినీళ్లపై, పింఛన్ పెంపు పై, భరోసా పెంపు పై లేకపాయే అని సంచలన ఆరోపణలు చేశారు. ఇక పది తగ్గిస్తే పగబట్టి 10 కి 10 కలిపి మరి పెంచుతున్నారని తెలిపారు. నాడు అడ్డగోలు ఆరోపణలు చేసి, నేడు అడ్డగోలుగా ధరల పెంపు చేపట్టారని చెబుతూ.. పెంచుకో.. దంచుకో.. పంచుకో.. అన్న దోరణిలో నేడు మద్యం ధరల పెంపు రేపు రేపు ఏం పెంపో? ఎన్నెన్ని పెంపో? అని వ్యాఖ్యానించారు.


Similar News