Chamala: తెలంగాణపై మన్మోహన్ ముద్ర.. ఎంపీ చామల ఆసక్తికర ట్వీట్

తెలంగాణపై మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్(Former Prime Minister Manmohan Singh) ముద్ర అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు.

Update: 2024-12-28 11:57 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణపై మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్(Former Prime Minister Manmohan Singh) ముద్ర అని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) ఆసక్తికర ట్వీట్ చేశారు. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శుక్రవారం మరణించగా.. ఇవాళ అంత్యక్రియలు(Funeral) నిగంబోధ్ ఘాట్(Nigambodh Ghat) లో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ చామల మన్మోహన్ హయాంలో తెలంగాణకు జరిగిన మేలును ప్రస్తావిస్తూ.. ఆయనకు కన్నీటి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా.. హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు(ORR), హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) ఆయన హయాంలోనే వచ్చాయని, ఐఐటీ హైదరాబాద్(TTI Hyderabad), హైదరాబాద్ ఐటీఐఆర్(Hyderabad ITIR) నెలకొల్పేందుకు కృషి చేశారని తెలిపారు. అలాగే గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, మణికొండ, నానక్ రామ్ గూడ్లో ఐటీ సెజ్లు(IT Sez), మెదక్, నల్గొండలో ఫార్మా సెజ్లు(Farma Sez) ఏర్పాటుకు మన్మోహన్ హయాంలోనే పునాదులు పడ్డాయని చెప్పారు. అంతేగాక సిరిసిల్ల టెక్స్ టైల్‌పార్క్(Siricilla Textile Park) ఏర్పాటులో ఆయన హస్తం ఉందని వెల్లడించారు. ఇక తెలంగాణను ప్రగతి వైపు నడిపించిన గొప్ప నాయకుడికి కన్నీటి వీడ్కోలు అని పోస్ట్ ద్వారా తెలియజేశారు.

Tags:    

Similar News