ఈ నెల 11న తెలంగాణకు రానున్న కేంద్ర బృందం

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఈ నెల 11న కేంద్ర బృందం తెలంగాణకు రానుంది.

Update: 2024-09-09 14:46 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు ఈ నెల 11న కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. గత వారం తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలు భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. పంటపొలాలు, అనేక ఊర్లు జలమయం అయ్యాయి. ఈ వరద నష్టాన్ని అంచనా వేసేందుకు తెలంగాణ రాష్ట్రానికి ఓ కేంద్ర బృందాని పంపిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. అలాగే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు తక్షణ సహాయం కింద రూ.3300 కోట్లు విడుదల చేశారు. కాగా ఇపుడు ఆయా ప్రాంతాల్లో పర్యటించి పూర్తి నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించనుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం వరద బాధితులు, అధికారులతో కేంద్ర బృందం సమావేశం అవనుంది. కాగా కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల బృందం రాష్ట్రానికి రానున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు కీర్తిప్రతాప్ సింగ్ తో మాట్లాడి పర్యటన వివరాలు ఖరారు చేసినట్టు ఆయన తెలిపారు.  


Similar News