తెలంగాణ సర్కారుకు కేంద్రం కీలక నోటీసులు

తెలంగాణ సర్కారుకు కేంద్రం కీలక నోటీసులు జారీ చేసింది.

Update: 2022-11-28 05:33 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సర్కారుకు కేంద్రం కీలక నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకంలో అవకతవకలపై కేంద్రం సీరియస్ అయింది. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన నిధుల దారి మళ్లించినందుకు తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. దారి మళ్లించిన రూ.152 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. రెండు రోజుల్లో నిధులను చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో తదుపరి వాయిదాలు నిలిపివేస్తామని హెచ్చరించింది. 

Tags:    

Similar News