IAS, IPS బదిలీలపై అత్యవసరంగా విచారించండి.. తెలంగాణ హైకోర్టులో కేంద్రం పిటిషన్
IAS, IPS బదిలీల విచారణను అత్యవసరంగా విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును కేంద్రం కోరింది...
దిశ, వెబ్ డెస్క్: IAS, IPS బదిలీల విచారణను అత్యవసరంగా విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టును కేంద్రం కోరింది. రాష్ట్ర విభజన తర్వాత 14 మంది IAS, IPS అధికారులను కేంద్రం ఏపీ, తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపై క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు అధికారులు. అలాగే కేంద్రం ఉత్తర్వులను నిలిపివేసి అధికారులు తెలంగాణలో కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డీజీపీ అంజనీకుమార్ సహా 12 మంది అధికారులు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టులో కేంద్రం పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరింది. అయితే జూన్ 5న విచారిస్తామని తెలంగాణ హైకోర్టు తెలిపింది. అయితే ఇప్పటికే హైకోర్టు ఆదేశంతో IAS అధికారి సోమేశ్ కుమార్ APకి వెళ్లిన విషయం తెలిసిందే.