Minister Komatireddy : కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి

కేంద్ర(Central)ప్రభుత్వ పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)సూచించారు.

Update: 2024-11-22 09:33 GMT

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర(Central)ప్రభుత్వ పథకాల నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Minister Komatireddy Venkat Reddy)సూచించారు. నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్థానిక ఎంపీ రఘువీర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన దిశ(కేంద్ర విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ) సమావేశంలో జిల్లా ఇంచార్జీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవంతో కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో ఎలా అమలు చేయించుకోవాలి వాటికి సంబంధించిన వ్యవస్థ ఎలా ఉంటుందని సభ్యులకు వివరించారు. పేదరిక నిర్మూలన పథకాల పర్యవేక్షణ, గ్రామాల్లో ఉపాధి అవకాశాలను పెంపొందించడం, సామాజిక భద్రతను కల్పించడం, గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి బాటపట్టేలా పనిచేసేందుకు దిశ కమిటీలను పనిచేస్తాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన, సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించేందుకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రతీ జిల్లాల్లో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ(దిశ) ని ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మలతో కలిసి జిల్లాలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పనితీరును సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు నేనావత్ బాలు నాయక్, వేముల వీరేశం, మందుల సామేల్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జయవీర్ రెడ్డి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..