Tapping Case: ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదు: కేంద్రం

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

Update: 2024-08-20 12:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:  రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ తో మాకు సంబంధం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అఫిడవిట్లు దాఖలు చేశారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయకూడదని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే మూడేళ్ల జైలు శిక్ష, రూ.2 కోట్ల జరిమానా ఉందని కేంద్రం తన అఫిడవిట్లో పేర్కొంది. ఈ అంశంలో హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామని కేంద్రం తెలిపింది. ఇక కేసు పురోగతిపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం మూడు వారాలకు వాయిదా వేసింది.మ

Tags:    

Similar News