జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు

హైదరాబాద్ కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది.

Update: 2024-08-13 16:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ కు చెందిన ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని ఐరన్ స్క్రాప్ గోదాములో అక్రమాలపై సదరు గోదాం యజమానిపై జీఎస్టీ అధికారులు ఫైన్ విధించి, గోదామును సీజ్ చేశారు. కాగా ఆ జరిమానా కట్టకుండా ఉండటానికి 5 లక్షలు లంచం తీసుకున్నారు జీఎస్టీ అధికారులు. గోదాం ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేయడంతో.. విసుగు చెందిన బాధితుడు సీబీఐని ఆశ్రయించి, తనకు న్యాయం చేయాలని కోరాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించి జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్, ఇన్స్పెక్టర్ మనీష్ శర్మల నుండి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సీబీఐ.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Similar News