HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై కేసు నమోదు

HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద గురువారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Update: 2024-01-25 11:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: HMDA మాజీ డైరెక్టర్ బాలకృష్ణపై కేసు నమోదైంది. పలు సెక్షన్ల కింద గురువారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు మాట్లాడుతూ.. బాలకృష్ణ ఇంటితో పాటు 16 ప్రదేశాల్లో తనిఖీలు చేశామని తెలిపారు. మొత్తంగా బాలకృష్ణ ఇంట్లో రూ.99.60 లక్షల నగదును సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు. అంతేకాదు.. 1988 గ్రాముల బంగారం, 6 కేజీల సిల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. రూ.8.26 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఇంకా ఆయన బినామీలపై విచారణ చేయాల్సి ఉందని ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రేపు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామన్నారు. కొన్ని విషయాలు ఆయన చెప్పలేదు.. మా విచారణకు సహకరించలేదని, కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుందన్నారు.

Tags:    

Similar News