మామ అల్లుళ్లపై కేసు.. మాజీ మంత్రి మల్లారెడ్డి పోలీసుల షాక్

మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది.

Update: 2024-06-14 07:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయనపై పేట్‌‌బషీర్‌బాద్ పోలీసులు భూ‌కబ్జా కేసు నమోదు చేశారు. మల్లారెడ్డి ఆయన అల్లుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితోపాటు మొత్తం 15 మందిపై 7 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. హైదరాబాద్ జీడిమెట్లలో సర్వే నం. 82లో 33 గుంటల తమ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి కబ్జా చేశారని, తమ స్థలంలో ఉన్న నిర్మాణాలను కూల్చివేశారని తాజాగా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శేరి శ్రీనివాస్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మల్లారెడ్డిపై వరుసగా భూ కబ్జా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసులు కేసు బుక్ చేయడంతో ఆయన అరెస్ట్ తప్పదా అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

హైకోర్టులో ఇష్యూ..

సుచిత్రలోని సర్వే నెంబర్ 83కు సంబంధించిన వివాదాస్పద భూమిపై రెవెన్యూ అధికారులు ఇటీవలే తెలంగాణ హైకోర్టుకు నివేదిక అందజేశారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు ఆ నివేదికలో స్పష్టం చేశారు. అనుమతి లేకుండా ఇతరుల భూమిలోకి ప్రవేశించి ఫెన్సింగ్ తొలగించిన మల్లారెడ్డిపై చర్యలకు ఉపక్రమించాలని రెవెన్యూ అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కబ్జాకు గురైన ప్రభుత్వం భూమికి వెంటనే రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. అయితే రెవెన్యూ శాఖ నివేదికతో భూమికి సంబంధించిన బాధితులకు ఉపశమనం కలిగింది. తమ భూమిని కబ్జా చేసిన మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని వారు కోర్టును కోరుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది.

Also Read...

Hot News: మాజీ మంత్రి మల్లా‌రెడ్డి అరెస్ట్..! భూ కబ్జా విషయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు 

Tags:    

Similar News