గోడలు దూకే నాయకులారా.. ఖబడ్దార్.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌లోని కీలక రాజకీయ నాయకులు కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కడుతున్నారు.

Update: 2024-04-29 05:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో నేతలు ఇతర పార్టీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌లోని కీలక రాజకీయ నాయకులు కాంగ్రెస్, బీజేపీలోకి వలసలు కడుతున్నారు. మరోవైపు లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. ఘర్ వాపసీ పేరుతో నేతలను ఆకర్షిస్తోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని కొందరూ మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇటీవల వరంగల్ మేయర్ గుండు సుధారాణితో పాటు ఇతర కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో వారు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని అక్కడి పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా వరంగల్‌లోని పలు కాలనీల్లో నేతల కార్టూన్స్.. ఫ్లెక్సీలకు చెప్పుల దండలు వేసి పార్టీ శ్రేణులు నిరసన తెలిపాయి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లోకి గోడలు దూకే నాయకులారా ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు. మిమ్మల్ని గెలిపించిన ప్రజల సమస్యలు పట్టించుకోరా? మీ పతనానికి చరమగీతం ముందుంది అని ఫ్లెక్సీలపై రాతలు ఉన్నాయి. దీంతో మున్సిపల్ సిబ్బంది ఆ ఫ్లెక్సీలు తొలగించారు.

Tags:    

Similar News