కాగ్ సంచలన నివేదిక.. ఎక్సైజ్ శాఖలో రూ.77 కోట్ల అక్రమాలు

తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ అక్రమాలు జరిగినట్టు కాగ్ సంచలన నిజాలు బయట పెట్టింది.

Update: 2024-08-03 12:20 GMT


దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఎక్సైజ్ శాఖలో భారీ అక్రమాలు జరిగినట్టు కాగ్ సంచలన నిజాలు బయట పెట్టింది. ఎక్సైజ్ శాఖకు పన్ను చెల్లింపుల విషయంలో రూ.77 కోట్ల అవకతవకలు జరిగాయని, అవన్నీ 2017-2022 సంవత్సరాల మధ్య జరిగినట్టు తనిఖీల్లో తేలిందని పేర్కొంది. ఈ విషయంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పనితీరుపై కాగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 179 కేసుల్లో పన్నులు చాలా తక్కువ చెల్లించారని, ఆలస్యంగా పన్నులు చెల్లించినా ఎటువంటి అపరాధ రుసుం వసూలు చేయలేదని తెలిపింది. మొత్తానికే పన్నులు ఎగవేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని... దీనిని బట్టి చూస్తే అధికారులు వారితో కుమ్మక్కై... రాష్ట్ర ఖజానాకు రూ.77 కోట్ల నష్టం చేకూర్చరాని కాగ్ మండిపడింది. కాగా ఈ విషయంపై అప్పుడే గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ప్రస్తుత ప్రభుత్వానికి లేఖ రాసినట్టు పేర్కొంది.


Similar News