Alleti Maheshwar Reddy: దేవుళ్లపై ఒట్టు వేసి రుణమాఫీ చేస్తామని మోసం చేశారు: బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) హయాంలో ఆస్థాన గుత్తేదారులకే కాంట్రాక్టులు ఇస్తున్నారని,కాంట్రాక్టులన్నీ వాళ్లే పంచుకుంటున్నారని బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) విమర్శలు చేశారు.

Update: 2024-09-24 20:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో:కాంగ్రెస్ ప్రభుత్వ(Congress Government) హయాంలో ఆస్థాన గుత్తేదారులకే కాంట్రాక్టులు ఇస్తున్నారని,కాంట్రాక్టులన్నీ వాళ్లే పంచుకుంటున్నారని బీజేఎల్పీ(BJLP) నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) విమర్శలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy)కి రూ.వేల కోట్ల కాంట్రాక్టులు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని ఏలేటి డిమాండ్ చేశారు. నాంపల్లి(Nampally) బీజేపీ రాష్ట్ర కార్యాలయం(BJP state Office)లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ రైతుల(Foremrs)కు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు అండగా నిలిచేందుకే ఇందిరాపార్క్(Indira Park) వద్ద దీక్ష చేయబోతున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామన్న రైతు భరోసాను ఎగ్గొడితే ఊరుకునే ప్రసక్తే లేదని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. కౌలు రైతులు యజమానులతో మాట్లాడుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageshwara Rao) అంటున్నారని, దీన్నిబట్టి చూస్తే కౌలు రైతులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అర్థమవుతోందని ఏలేటి అనుమానం వ్యక్తంచేశారు.

సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. సన్న వడ్లపై ఉత్తమ్ తప్పుడు లెక్కలు చెబుతున్నారని, తెలంగాణలో ఎక్కువ మంది సన్న వడ్లను పండించరని, ఎక్కువ శాతం దొడ్డు వడ్లే ఇక్కడ పండుతాయని ఏలేటి పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు ఇచ్చే ధర కన్నా మార్కెట్ లో ఎక్కువ ధర ఉందని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా వేశారు. కాంగ్రెస్ నేతలు ఇచ్చేది బోనస్ కాదని బోగస్ అని సెటైర్లు వేశారు. అన్నదాతలకు కాంగ్రెస్ పాలకులు మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏ ఊరికి వెళ్తే అక్కడ దేవుళ్లపై ఒట్లు వేసి రైతులకు రుణమాఫీ(Loan Wavier) చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ఏలేటి మండిపడ్డారు. రైతు రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవసరమవుతాయని నిపుణులు చెప్పారని, కానీ కేబినెట్ లో రూ.30 వేల కోట్లకు ఆమోదం తెలిపి తీరా రూ.17 వేల కోట్లే ఖర్చు చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ రుణమాఫీ చేశామని చెబుతుంటే మంత్రులు కాలేదని చెబుతున్నారని ఏలేటి పేర్కొన్నారు.


Similar News