కేబినెట్ భేటీ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని టీఆర్టీఎఫ్ విజ్ఞప్తి

ప్రభుత్వ బడుల బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది.

Update: 2023-03-08 15:19 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రేపు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో విద్యారంగ సమస్యల పరిష్కారించాలని, ప్రభుత్వ బడుల బలోపేతం దిశగా నిర్ణయాలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం అధ్యక్షుడు కావలి అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి కటకం రమేష్ ఒక ప్రకటన విడుదల తెలిపారు. బీజేపీ యేతర పాలిత 5 రాష్ట్రాల్లో సీపీఎస్ రద్దుకు చర్యలు తీసుకున్నారని, ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని కోరారు.

తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. పండిత్, పీఈటీ విషయంలో కోర్టులో కేసు సత్వర పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు తిరిగి వాయిదా పడకుండా వేసవి సెలవుల్లోనే బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగులో ఉన్న మూడు డీఏ వాయిదాలను వెంటనే మంజూరు చేయాలన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన చాలా రకాల బిల్స్ ఈ కుబేర్ లో నెలల తరబడి పెండింగులో పెడుతున్నారని, దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ కుబేర్‌లో పెండింగులో ఉన్న అన్ని బిల్లులను మార్చి నెలాఖరులో మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News