తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు.. మంత్రి లోకేష్‌కు క్యాబ్ డ్రైవర్ల వినతి పత్రం

అమరావతిలో నిర్వహించిన ప్రజాదర్భార్‌లో మంత్రి నారా లోకేష్‌ను క్యాబ్ డ్రైవర్లు కలిశారు.

Update: 2024-07-02 06:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: అమరావతిలో నిర్వహించిన ప్రజాదర్భార్‌లో మంత్రి నారా లోకేష్‌ను క్యాబ్ డ్రైవర్లు కలిశారు. హైదరాబాద్‌లో తాము ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వ నిబంధనలపై లోకేష్‌కు వినతిపత్రం అందజేశారు. తమ వాహనాలకు మళ్లీ లైఫ్ ట్యాక్స్ చెల్లించాలంటున్నారని క్యాబ్ డ్రైవర్లు తెలిపారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాలపరిమితి ముగియడంతో లైఫ్ ట్యాక్స్ నిబంధనలు ఉండగా.. ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటికే వాహనాలకు లైఫ్ ట్యాక్స్ కట్టామని డ్రైవర్లు తెలిపారు. మరోసారి లైఫ్ ట్యాక్స్ కట్టడం ఆర్థికంగా తీవ్ర నష్టమని క్యాబ్ డ్రైవర్లు లోకేస్ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్‌లో ఏపీ వాహనాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారని డ్రైవర్లు తెలిపారు. ఈ నెల 6న రేవంత్‌తో చంద్రబాబు భేటీలో సమస్య పరిష్కరించాలని విన్నవించారు. హైదరాబాద్‌లో తమ వాహనాలకు కొంత కాలం వెసులుబాటు కల్పించాలని వినతి పత్రంలో కోరారు.


CM చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే..?




Tags:    

Similar News