Burra Venkatesham: టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ

టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు.

Update: 2024-12-05 10:48 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్‌గా మాజీ ఐఏఎస్  బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది బుర్రా వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కమిషన్ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో తదుపరి చైర్మన్‌గా ప్రభుత్వం బుర్రా వెంకటేశం పేరును గవర్నర్‌కు సిఫార్సు చేసింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఇటీవలే ఆ ఫైల్‌కు ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం ఆయన్ను కమిషన్ చైర్మన్‌గా నియమించింది.

Tags:    

Similar News