Free journey: న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేళ గుడ్ న్యూస్.. రేపు ఫ్రీ జర్నీ

న్యూఇయర్ సెలబ్రేషన్స్ వేళ గుడ్ న్యూస్

Update: 2024-12-30 13:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వేళ తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ (Telangana Four Wheelers Association) కీలక నిర్ణయం తీసుకుంది. 31వ డిసెంబర్ రాత్రి 10 నుండి అర్థరాత్రి 1 వరకు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా (Free Journey) సదుపాయం అందిస్తామని తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ & తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శైఖ్ సలాహుద్దీన్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సేవల కోసం కోసం 9177624678 నంబర్ ను సంప్రదించాలని సూచించారు. 2017 నుండి, మా సంఘం “హమ్ ఆప్కే సాథ్ హై” (Hum aapke saath hai) పబ్లిక్ సర్వీస్ క్యాంపెయిన్ ద్వారా రోడ్డు భద్రత కోసం నిరంతరం పని చేస్తోందని తెలిపారు.

Tags:    

Similar News