పెండింగ్ నల్లా బిల్లుల చెల్లింపుకు బంపర్ ఆఫర్

జంట నగరాల్లో నల్లా బిల్లుల బకాయిలు వసూలు చేసేందుకు ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్(OTS) పథకం ప్రకటించింది.

Update: 2024-10-23 07:49 GMT

దిశ, వెబ్ డెస్క్ : జంట నగరాల్లో నల్లా బిల్లుల బకాయిలు వసూలు చేసేందుకు ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్(OTS) పథకం ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా అసలు కట్టి ఆలస్య రుసుం, వడ్డీ రాయితీ కల్పిస్తుంది. ఈ నెల 31లోగా పెండింగ్ నల్లా బిల్లులను మెట్రో వాటర్ బోర్డుకు చెల్లించి..ఆలస్య రుసుం, వడ్డీ రాయితీ పొందాలని నగర వాసులకు సూచించింది. డొమెస్టిక్, నాన్ డొమెస్టిక్, పరిశ్రమలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, బల్క్ ఎంఎస్ బీ కేటగిరి కనెక్షన్లకు, ఇంకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు కూడా ఈ వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం వర్తిస్తుందని హైదరాబాద్ మెట్రోపాలిటీ వాటర్ సప్లై అండ్ సెవరేజ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ అధికార ప్రకటనలో వెల్లడించారు.

జంట నగరాల్లో భారీగా పేరుకుపోయిన నల్లా బిల్లుల వసూళ్ళపై దృష్టి సారించిన ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ పై భారీ ఆశలే పెట్టుకున్నారు. రవాణ, ట్రాఫిక్ విభాగాల తరహాలో తమకు కూడా వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం భారీ కలెక్షన్లు తెచ్చిపెడుతుందని ఎదురుచూస్తున్నారు.


Similar News