తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి సీతక్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తోమాల సేవలో సీతక్క కుటుంబ సమేతంగా వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Update: 2024-10-23 10:12 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రి సీతక్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తోమాల సేవలో సీతక్క కుటుంబ సమేతంగా వెంకన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషంగా ఉండాలని దేవదేవుడిని కోరుకున్నానని, అలాగే వయనాడ్ లో ఈ రోజు నామినేషన్ వేస్తున్న ప్రియాంక గాంధీ ఘన విజయం సాధించాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు.

కాగా తాజాగా తిరుమల సందర్శనకు వెళ్ళిన కాంగ్రెస్ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లు తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలు టీటీడీ పరిగణలోకి తీసుకోకపోవడం పట్ల మండిపడ్డారు. సీతక్క మాత్రం ఈ విషయమై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. తెలంగాణ సిఫారసు లేఖలను టీటీడీ రద్దు చేయడం పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, ప్రజాప్రతినిధులపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి, వెంకట్ లు మండిపడ్డారు. ‘

ఏపీ నేతలు మా దగ్గరికి వచ్చి వ్యాపారాలు చేసుకుంటే మేము ఒక్కమాట అనడం లేదని, మీరు తెలంగాణకు రావొద్దని, అసెంబ్లీలో బాయ్‌కాట్‌ అనే నిర్ణయం తీసుకుంటే మీరే బాధపడతారంటూ హెచ్చరించారు. సీఎం చంద్రబాబును ఒక్కటే అడుగుతున్నామని.. మీరు విభజన సమయంలో ఒక కన్ను తెలంగాణ .. ఒక కన్ను ఆంధ్రా అని చెప్పారు. మరి ఈ రోజు ఒక కన్ను (తెలంగాణ)ను తీసేశారా? మీ ఎమ్మెల్యేలు, నేతలు యాదాద్రి, భద్రాచలం వచ్చి ఈవోలకు ఫోన్లు చేస్తే గౌరవమర్యాదలిస్తున్నారని, ఇక్కడ తిరుమలలో మాత్రం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. 


Similar News