పాన్ ఇండియా సినిమా కలెక్షన్లను మించిన ఆర్టీసీ ‘దసరా’ ఆదాయం

దసరా(Dussehra) పండుగ టీజీఎస్‌ఆర్‌టీసీ(TGSRTC)కి భారీ ఆదాయం తీసుకొచ్చిపెట్టింది. దసరా, బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకొని అధిక బస్సులను నడిపారు.

Update: 2024-10-23 10:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: దసరా(Dussehra) పండుగ టీజీఎస్‌ఆర్‌టీసీ(TGSRTC)కి భారీ ఆదాయం తీసుకొచ్చిపెట్టింది. దసరా, బతుకమ్మ పండుగలను దృష్టిలో పెట్టుకొని అధిక బస్సులను నడిపారు. ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య 15 రోజుల వ్యవధిలో కోట్లాది మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఈ పండుగ ఆర్టీసీకి ఏకంగా రూ.307 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు దసరా, బతుకమ్మ పండుగల సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 కోట్ల 7 లక్షల 73 వేల మంది ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించారని టీజీఎస్‌ఆర్‌టీసీ వెల్లడించింది. దీంతో ఈ 15 రోజుల్లో ఆర్టీసీకి రూ.307.16 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈ బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా 10,512 అదనపు బస్సులను మళ్లించినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. పండుగ వేళ ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు సైతం ఆర్టీసీ అదనపు బస్సులను నడిపించింది. ఈనెల 9, 10, 11 తేదిల్లో ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణించినట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు.

Tags:    

Similar News