ఫిబ్రవరి 3 నుంచి బడ్జెట్ సమావేశాలు!

ఫిబ్రవరి మూడో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది.

Update: 2023-01-21 06:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఫిబ్రవరి మూడో తేదీ నుంచి బడ్జెట్ సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. వారం రోజులపాటు ఈ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. ఫిబ్రవరి 6న బడ్జెట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. అందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అన్ని శాఖల వారీగా సమాచారాన్ని సిద్ధం చేస్తోంది. ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సమావేశాలపై సమాచారం ఇవ్వనున్నట్లు తెలిసింది.

గత సమావేశాలకు కొనసాగింపుగానే..

గతేడాది సెప్టెంబర్ 13న అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించింది. అయితే అసెంబ్లీని ప్రోరోగ్ చేయలేదు. దీంతో కొనసాగింపుగానే సమావేశాలను నిర్వహించనున్నారు. గవర్నర్ ప్రసంగం లేకుండానే ఈసారి సైతం బడ్జెట్ సమావేశాలు కొనసాగనన్నాయి. 2021 సెప్టెంబర్ 27న మొదలైన సమావేశాలను కొనసాగింపుగానే గత ఏడాదిన్నరగా అసెంబ్లీ సమావేశాలను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం గవర్నర్ మధ్య విభేదాల కారణంగా అసెంబ్లీని ప్రోరోగ్ చేయకుండా ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఎనిమిదవ బడ్జెట్ సమావేశాలు నాలుగో సెట్టింగ్‌గా నిర్వహించే అవకాశం ఉంది.

బడ్జెట్‌పై ఉత్కంఠ..

2023-2024 బడ్జెట్ పెంచుతారా? అదే బడ్జెట్ కొనసాగిస్తారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2022-23 సంవత్సరంలో రాష్ట్రం మొత్తం బడ్జెట్ రూ. 2,56,958.51 కోట్లు. అందులో వ్యవసాయ రంగానికి రూ.24,254 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.11,728 కోట్లు, * కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ రూ. 2,750 కోట్లు, * డబుల్ బెడ్రూమ్ ల కోసం రూ. 12,000 కోట్లు * దళితబంధు రూ.17,700 కోట్లు.

* మన ఊరు- మన బడి రూ.7,289 కోట్లు.

* ఎస్టీల సంక్షేమం కోసం రూ.12,565 కోట్లు

* పట్టణ ప్రగతి కోసం రూ. 1,394 కోట్లు

* బిసి సంక్షేమం కోసం రూ.5,698కోట్లు

* బ్రాహ్మణుల సంక్షేమం కోసం రూ. 177 కోట్లు

* పల్లె ప్రగతికి రూ. 3,330 కోట్లు

* ఫారెస్ట్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు

* హరితహారానికి రూ. 932 కోట్లు

* రోడ్లు, భవనాల కోసం రూ.1,542 కోట్లు కేటాయించారు. అయితే ఈసారి బడ్జెట్ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏ ఏ శాఖలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే దళిత బంధు, రైతు రుణమాఫీ వీటికి తోడు గిరిజన బంధు సైతం కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేస్తామని కేసీఆర్ ప్రకటించడంతో ఎంత కేటాయిస్తారు అనేది చర్చనీయాంశమైంది. వీటికి తోడు ఇళ్ల జాగా ఉన్నవారికి రూ.3లక్షల స్కీంకు ఎన్ని నిధులు కేటాయిస్తారు అనే ఆసక్తి నెలకొంది. ఏ ఏ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు.. కొత్తగా ఏమైనా స్కీములు తీసుకొచ్చి వాటికి సైతం నిధులు కేటాయిస్తారా అనేది విషయాలు తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Also Read...

'ప్రతి ఒక్కరూ కంటి వెలుగుకు వెళ్లాల్సిందే... లేదంటే ఆరోగ్యశ్రీ కట్' 

Tags:    

Similar News