తెలంగాణ ప్రజలు BJP పట్ల జాగ్రత్తగా ఉండాలి: RSP

విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు, ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు.

Update: 2023-04-16 14:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే వరకు, ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల విషయంలో కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా ఆదివారం గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని గ్రామాల్లో ఆర్ఎస్పీ చర్చిలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. విద్యుత్ ఉద్యోగులు తమకు 30 శాతం పీఆర్సీ ఇవ్వాలని డిమాండ్ చేయగా, ఉద్యోగులను బెదిరించి, భయపెట్టి కేవలం 7 శాతానికి మాత్రమే పరిమితం చేశారని విమర్శించారు. అంతేకాకుండా ఆర్టిజన్ ఉద్యోగులకు, రెగ్యులర్ ఉద్యోగుల వలే అన్ని సౌకర్యాలు అందించకుండా, రెండో శ్రేణి ఉద్యోగుల వలే, చిన్న చూపు చూస్తూ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

తెలంగాణ ప్రజలారా బీజేపీతో జాగ్రత్త

బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో అతీక్ అహ్మద్ హత్య అత్యంత దారుణమని, పోలీసుల సమక్షంలోనే హత్య జరగడం దురదృష్టకరమన్నారు. యూపీలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా క్షీణించాయన్నారు. తెలంగాణ ప్రజలంతా బీజేపీ పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీజేపీ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఇలాంటి పరిస్థితులే వస్తాయని హెచ్చరించారు. బహుజన రాజ్యం వస్తేనే బతుకులు మారుతాయని తెలిపారు. ఇంకెంతకాలం కూలీలుగా, పేదలుగా బతుకుతామని ప్రశ్నించారు. పేదలు ప్రభుత్వ కాంట్రాక్టర్లు కావాలంటే, గుడిసెలల్లో పుట్టిన పిల్లలు విదేశాల్లో చదవాలంటే బహుజన రాజ్యం రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేశవరావు, జిల్లా ఇంఛార్జి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News