కేసీఆర్ సార్.. దయచేసి మోసాలు ఆపండి: RSP
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవనడం పచ్చి అబద్ధం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు లేవనడం పచ్చి అబద్ధం అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీరియస్ అయ్యారు. 2014 నుండి 2022 వరకు 6912 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. పత్రికల్లో వచ్చిన కథనాలు రైతు స్వరాజ్య వేదిక దగ్గర ఉన్నవని, ఈ ఏడాదిలో కూడా మొదటి 57 రోజుల్లోనే 52 రైతు ఆత్మహత్యలు జరిగాయని ఆర్ఎస్పీ ఆరోపించారు. అందులో ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 12 రైతు ఆత్మహత్యలు జరిగినయన్నారు. కేసీఆర్ ఇకనైనా రైతులను మోసం చేయడం ఆపాలంటూ ఆర్ఎస్పీ ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు.
పచ్చి అబద్ధం..
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 2, 2023
2014 నుండి 2022 వరకు 6912 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
పత్రికలలో వచ్చిన కథనాలు రైతు స్వరాజ్య వేదిక దగ్గర ఉన్నవి.
ఈ 2023లో కూడా మొదటి 57రోజుల్లోనే 52 జరిగాయి.
ముఖ్యమంత్రి గారి సిద్దిపేట జిల్లాలోనే అత్యధికంగా 12 జరిగినయి.!
CM sir, Stop fooling #India pic.twitter.com/2l3F1lKUBU