'రాజ్యాంగాన్ని మార్చే దమ్మున్నోడు ఇంకా పుట్టలేదు కామ్రేడ్'

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2022-09-19 10:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థించడమే కాకుండా.. మార్చాల్సిందే అంటోన్న సీపీఎం నేతలపై సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్పీ మండిపడ్డారు. ''కామ్రేడ్, భారత రాజ్యాంగాన్ని మార్చే దమ్మున్నోడు ఇంకా పుట్టలే కానీ, సీపీఎం 17 మంది పొలిట్ బ్యూరోలో ఒక్కరే BC & SC ఉన్నరేంది? BJP వాళ్లు దోపిడీ దొంగలే కానీ, తెలంగాణను నిలువునా దోపిడీ చేసిన కేసీఆర్ లౌకిక ముసుగు మీకు కనిపించకపోవటం విడ్డూరం! దొరల వందల ఎకరాల ఫాం హౌసుల్లో జండాలు పాతే దమ్ముందా?'' అంటూ ట్విట్టర్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..