BRS: ఎవ‌రి ప్రయోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నారు..? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

ప‌నిమంతుడని పందిరేపిస్తే.. పిల్లి తోక త‌గిలి కూలింద‌ట‌ అని, కొనుగోలు, అమ్మకాలు లేనిది ఆదాయం ఎట్లా పెరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2024-10-07 12:10 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప‌నిమంతుడని పందిరేపిస్తే.. పిల్లి తోక త‌గిలి కూలింద‌ట‌ అని, కొనుగోలు, అమ్మకాలు లేనిది ఆదాయం ఎట్లా పెరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. "హైడ్రా.. రిజిస్ట్రేషన్లు విత్‌డ్రా" అని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేటీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. రేవంత్ రెడ్డి తీరు మనిమంతుని పందిరి తీరే ఉందని విమర్శలు చేశారు. తెలంగాణ‌కు గుండెకాయ వంటి హైద‌రాబాద్ ను కాపాడుకోవ‌టం చేత‌కాక‌, సామాన్యుల‌పైకి బుల్డోజ‌ర్స్ పంపి.. భ‌యాన్ని సృష్టించారని, తీరా చూస్తే, రాష్ట్రానికి వ‌చ్చే ఆదాయం ప‌డిపోయిందని వ్యాఖ్యానించారు.

అలాగే హైడ్రా హైరానాతో 2నెల‌ల్లో హైద‌రాబాద్ రియ‌ల్ ఎస్టేట్ ప‌డిపోయిందని, రిజిస్ట్రేష‌న్లు ప‌డిపోయి, ఆదాయం త‌గ్గిపోయిందని ఆరోపించారు. అంతేగాక మీరు కొత్తగా ఆదాయం సృష్టించుడు లేకుంటే పాయే. కానీ, ఉన్నది ఊడ‌గొడుతున్నారని, ఎవ‌రి ప్రయోజ‌నాల కోసం ప‌నిచేస్తున్నారో అర్థమైతుందా అని అడిగారు. మీ ఫోర్ బ్రద‌ర్ సిటీపై ఫోక‌స్ చేసి, అక్కడ కృత్రిమ రియ‌ల్ బూమ్ కోసం ఆలోచిస్తున్నట్లున్నారని అన్నారు. సామాన్యులు కొనుగోలు, అమ్మకం లేనిది బూమ్ ఎట్లా వ‌స్తదని, ఆదాయం ఎట్లా పెరుగుత‌ది అని ప్రశ్నించారు. ఇక తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.


Similar News