TS Assembly: అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ మద్దతు

మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది.

Update: 2024-07-24 11:22 GMT

దిశ, వెబ్ డెస్క్: మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది. అంతకు ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఎటువంటి కేటాయింపులు చేయలేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే విషయంపై సభలో చర్చకు కాంగ్రెస్ పిలుపు నివ్వగా బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చర్చించాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానానికి బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని.. హరీష్ రావు ప్రకటించారు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్ లో నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో దీక్ష చేయాలని,, దానికి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించగా.. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. అందరం కలిసి దీక్ష చేద్దామని ఆ దీక్షకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ పాల్గొనాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీంతో తెలంగాణ అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై వాడి వేడి చర్చకు దారితీసింది.

Tags:    

Similar News