పీక్స్‌కు చేరిన పొలిటికల్ వార్.. రేవంత్ రెడ్డిపై సీఈవోకు BRS కంప్లైంట్
తెలంగాణలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్‌కు చేరుకుంది. ఈ క్రమంలో ఇరు పార్టీలు ఎన్నికల సంఘానికి పరస్పరం ఫిర్యాదు చేసుకోవడం చర్చనీయాశంగా మారుతోంది. తాజాగా బీఆర్ఎస్ లీగల్ సెల్ టీమ్ మరోసారి ఈసీఓ వికాస్ రాజ్‌ను కలిసి కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని.. అలాగే బీఆర్ఎస్‌ను కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ యాడ్స్ ఇస్తోందని వాటిని ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈసీకి తెలిపిన యాడ్స్ సారాంశం ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో వస్తున్న కాంగ్రెస్ ప్రకటనల సారాంశాలు మరొకలా ఉన్నాయని వెంటనే వీటిని ఆపాలని కోరారు. ఇటీవల దుబ్బాక, ఇబ్రహీంపట్నం, అచ్చంపేటలో బీఆర్ఎస్ నేతలపై ఎటాక్స్ జరిగాయని వీటన్నింటికి రేవంత్ రెడ్డి రెచ్చగొట్టడమే కారణం అని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రశాంతంగా జరగాల్సి ఎన్నికలను రేవంత్ రెడ్డి హింసాత్మకంగా మార్చుతున్నాయని ఆరోపించారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రచార ప్రకటనలు ఆపేలా ఎన్నికల కమిషన్‌పై బీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.