రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎంపీ కవిత ఘాటు వ్యాఖ్యలు

రేవంత్ రెడ్డి బలుపుతో మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది.

Update: 2023-02-11 13:55 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి బలుపుతో మాట్లాడుతున్నాడని బీఆర్ఎస్ ఎంపీ కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. శనివారం అసెంబ్లీలో మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన కవిత.. తనతో తన తండ్రిపై రేవంత్ రెడ్డి చేసిన భూకబ్జాల ఆరోపణలపై స్పందించారు. మహబూబాబాద్‌లో రేవంత్ రెడ్డి విమర్శలు చేయాలంటే మేము తప్ప ఎవరూ కనిపించడం లేదని ఫైర్ అయ్యారు. మా నాన్న నిజాయితీగా రాజకీయాలు చేశారని అందుకే జనరల్ స్థానంలో 7 సార్లు గెలిచారని అన్నారు. అవినీతి, అక్రమాలు చేయడం మా కుటుంబంలోనే లేదని, మేము అవినీతికి పాల్పడితే ప్రజలు ఇన్ని సార్లు గెలిపించరు కదా అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శల్లో వాస్తవం ఉండాలన్నారు. కేసీఆర్ ఎక్కడ అవకాశం ఇచ్చినా తనకు అంగీకారమే అని చెప్పారు.

2009లో ఎమ్మెల్యే సీటు కోసం చూశానని అయితే సీఎం కేసీఆర్ ఎంపీకి పోటీ చేయాలని సూచిస్తే ఎంపీకే పోటీ దిగానని, ఇప్పుడు కూడా కేసీఆర్ ఎలా చెప్తే అలానే చేస్తాన్నారు. ఎమ్మెల్యే హరిప్రియకు తన మద్దతు ఉంటుందన్నారు. కాగా హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి మాలోత్ కవితతో పాటు ఆమె తండ్రి రెడ్యా నాయక్‌పై తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ మియాపూర్‌లోని కోట్ల విలువ కలిగిన ఐదెకరాల భూమిని ఎంపీ కవితకు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ భూమి కోసమే రెడ్యా నాయక్ కాంగ్రెస్ ను వీడారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రెడ్యానాయక్ సైతం కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో తనకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. ఒక వేళ నిరూపించలేకపోతే రేవంత్ రెడ్డి చెప్పు దెబ్బలు తినడానికి సిద్దమేనా అని ఛాలెంజ్ చేశారు. గోడలకు పెయింట్ వేసుకునే రేవంత్ రెడ్డి ఇప్పుడు వేల కోట్లకు ఎలా పడగలెత్తారని రెడ్యానాయక్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ భ్రష్టుపట్టించారని దుయ్యబట్టారు.

Also Read..

HYD: ముగిసిన రేసింగ్.. నగర వాసులకు మంత్రి కేటీఆర్ క్షమాపణ  

Tags:    

Similar News

టైగర్స్ @ 42..