పోలీసుల గౌరవాన్ని కాపాడుకోవాలంటూ డీజీపీకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

పు చింతపండు అయితదని సీఎం రేవంత్ అంటున్నారు. నాలుక మంచిగుంటే వీపు మంచిగుంటుంది.. మేము తిరగబడితే ముఖ్యమంత్రి వీపే చింతపండు అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-09-19 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : వీపు చింతపండు అయితదని సీఎం రేవంత్ అంటున్నారు. నాలుక మంచిగుంటే వీపు మంచిగుంటుంది.. మేము తిరగబడితే ముఖ్యమంత్రి వీపే చింతపండు అవుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఇందులో కిందిస్థాయి పోలీసుల పాత్ర ఉందని ఆరోపిస్తూ డీజీపీ జితేందర్ కు గురువారం ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద గౌడ్, సంజయ్ కుమార్, వేముల ప్రశాంత్ రెడ్డి తో కలిసి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి పోలీసులు ఈ దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల పై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిల్లర దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు. మాది ఉద్యమ పార్టీ అని, ఎన్నో దాడులు ఎదుర్కొన్నామని అన్నారు. సీఎం నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.

సూర్యాపేట తిరుమలగిరిలో, ఖమ్మం జిల్లాలో, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయం పై, కౌశిక్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని మండిపడ్డారు. కౌశిక్ ఇంటిపై దాడి ఘటనలో ఏసీపీ, సీఐ పాత్ర ఉన్నదని ఆరోపించారు. పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని, ప్రతిష్ట దిగజారుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల పుట్టిన రోజు వేడుకలను పోలీస్ స్టేషన్‌లో జరుపుతున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల గౌరవాన్ని కాపాడుకోవాలని డీజీపీని కలిసి కోరామన్నారు. రాష్ట్ర సీఎంకు సోయి లేదు.. వేదిక ఏదని చూడకుండా బజారు భాష వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడి పిల్లల దగ్గర నుంచి గాంధీ భవన్ కార్యక్రమం దాకా ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్‌ను తిట్టడానికే సీఎం కు సరిపోతుందని ఆరోపించారు. రేవంత్ వ్యవహారం సీఎం స్థాయి కి తగ్గట్టు లేదన్నారు. ఆయన ప్రవర్తన, వాడుతున్న భాషతోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పై కేసీఆర్ చెందుతున్న ఆందోళనను డీజీపీ దృష్టికి తెచ్చామని, ఇప్పటికైనా పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయాలని కోరారు.


Similar News