ప్లాష్ న్యూస్.. తెలంగాణ అసెంబ్లీ ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్

తెలంగాణ అసెంబ్లీ ముందు మరోసారి గందరగోళం వాతావరణం నెలకొంది.

Update: 2024-08-01 08:10 GMT

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ముందు మరోసారి గందరగోళం వాతావరణం నెలకొంది. బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ వెనకాల ఉన్న అక్కలు మోసం చేస్తారని.. గతంలో నన్ను మోసం చేసే ఇప్పుడు మీ వెనుక కూర్చున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డిని ఉద్దేశించి అన్నారు. దీంతో బీఆర్ఎస్ మహిళా సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి అవమానించారని ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. కానీ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మాట్లాడటానికి మైక్ ఇస్తామని స్పీకర్ చెప్పుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీలో సీఎం ఛాంబర్ ముందు నిరసన వ్యక్తం చేశారు. సీఎం క్షమాపణ చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. దీంతో మార్షల్స్ రంగంలోకి దిగి బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు పంపించారు. దీంతో అసెంబ్లీ ముందు రోడ్డుపై బైటాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి.. స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Similar News