BREAKING: బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కాంగ్రెస్‌‌లో చేరిన మరో గులాబీ పార్టీ MLA

బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ నుండి అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసల ప్రవాహం కంటిన్యూ అవుతోంది.

Update: 2024-07-12 13:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ పార్టీ నుండి అధికార కాంగ్రెస్‌ పార్టీలోకి ఎమ్మెల్యేల వలసల ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పి హస్తం పార్టీలో చేరగా.. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటీకి చేరారు. తాజాగా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ముందు చెప్పినట్లుగానే శుక్రవారం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పి ప్రకాష్ గౌడ్‌ను సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఇన్వైట్ చేశారు. బీఆర్ఎస్ నుండి ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ కాగా.. ప్రకాష్ గౌడ్ దెబ్బతో ఆ సంఖ్య ఎనిమిదికి చేరింది.

ప్రకాష్ గౌడ్ కంటే ముందు.. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ పార్టీకి దెబ్బేసి కాంగ్రెస్‌లో చేరారు. ప్రకాష్ గౌడ్‌తో బీఆర్ఎస్‌ను వీడిన వారి సంఖ్య ఎనిమిదికి చేరగా.. త్వరలోనే మరి కొందరు ఎమ్మెల్యేలు సైతం కారు దిగి హస్తం పార్టీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం వరకు ఈ చేరికల పర్వం కొనసాగుతుందని అధికార పార్టీ నేతలు అంటుడటంతో.. మరీ బీఆర్ఎస్‌‌లో వలసల ప్రవాహనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుందో చూడాలి. 

 

Tags:    

Similar News