Kaushik Reddy: సీఎం రేవంత్ రెడ్డి వల్లే తెలంగాణలో భూకంపం

బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-04 11:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బంజారాహిల్స్ ఏసీపీ(Banjara Hills ACP)కి పొద్దున ఫోన్ చేస్తే మధ్యాహ్నం 3 గంటలకు రమ్మన్నారు. తాను పోలీస్ స్టేషన్ వెళ్లడానికి ముందే ఏసీపీ వెళ్లిపోయారు. సీఐ కూడా వెళ్లి పోయేందుకు ప్రయత్నిస్తే తమ పార్టీ కార్యకర్తలు ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే అని గౌరవం లేకుండా సీఐ ప్రవర్తించారు. డీజీపీ(DGP) కంటే ఎక్కువ ప్రొటోకాల్ ఎమ్మెల్యే‌కు ఉంటుందని సీఐకి తెలియదా? అని కౌశిక్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సీఎం సోదరులకు పోలీసులు వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు బంజారాహిల్స్ సీఐకి నా ఫిర్యాదు ఇచ్చి రసీదు తీసుకున్నా అని తెలిపారు.

‘నా ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి(Intelligence IG Shivdhar Reddy) నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. నేను ఓ మిత్రుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి అక్కడికి పోలీసులను పంపించారు. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి డ్రగ్స్ కేసులో ఇరికించాలని ప్రయత్నించారు. కచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి, శివధర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలి. హరీష్ రావు మీద నా మీద సీఎం రేవంత్ కుట్ర చేస్తున్నాడు. ఇవాళ నేను ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ చేయకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు. నాతో పాటు మా అగ్ర నేతలందరి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి’ అని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు.. సీఎం రేవంత్ దేవుళ్ళ మీద ఒట్లు వేయడం వల్లే రాష్ట్రంలో భూ కంపం వచ్చిందని అన్నారు. సీఎం పాపాల నుంచి ప్రజలను దేవుళ్ళే కాపాడాలని తెలిపారు.

Tags:    

Similar News