MLA Jagadish Reddy : అరచేతిలో వైకుంఠం చూపించిన బడ్జెట్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)రాష్ట్ర బడ్జెట్(State Budget) ప్రవేశ పెట్టారు.

Update: 2025-03-19 16:25 GMT
MLA Jagadish Reddy : అరచేతిలో వైకుంఠం చూపించిన బడ్జెట్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో నేడు డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క(Deputy CM Mallu Bhatti Vikramarka)రాష్ట్ర బడ్జెట్(State Budget) ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) మండిపడ్డారు. బడ్జెట్ తో అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. బడ్జెట్‌ అన్ని వర్గాలను మోసం చేసేలా ఉందని, లేనివి ఉన్నట్లుగా చూపించిన మాయల మాంత్రికుడు రేవంత్‌రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంచనాలకు సంబంధం లేకుండా అరచేతిలో వైకుంఠం చూపించించారని.. కాంగ్రెస్ మేనిఫెస్టోపై పెట్టుకు ఆశలు మళ్లీ అడియశలయ్యాయన్నారు. ప్రభుత్వం ఆదాయం తగ్గిందని.. కాంగ్రెస్ నాయకుల ఆదాయం పెరిగిందని ఆరోపించారు. రేవంత్ పాలనలో లక్షా 50 వేల పింఛన్లు కోత పెట్టింది వాస్తవం కాదా? అంటూ ప్రశ్నించారు.

రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేస్తామని చెప్పి.. రూ.20వేల కోట్లతో రుణమాఫీ చేశామని ఈ బడ్జెట్‌లో చెప్పారన్నారు. గత ఏడాది రూ.5,888 కోట్ల రెవెన్యూ మిగులు ఉందని.. ఈ ఏడాది రెవెన్యూ మిగులు రూ.2,738 కోట్లు ఉంటుందని అంటున్నారని.. ప్రతి ఏటా రెవెన్యూ మిగులు ఉంటే రాష్ట్రం దివాలా తీసిందని ఎట్లా చెబుతారని నిలదీశారు. గడిచిన ఏడాది మైనారిటీలకు వెయ్యి కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని.. మైనారిటీ మంత్రి లేడని.. కనీసం మైనార్టీలకు ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం రాష్టంలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లను మూసేసే కుట్ర జరుగుతుందని.. రాష్ట్రంలో బీసీలకు మొండిచేయి బడ్జెట్‌లో బీసీలకు సబ్ ప్లాన్ పెట్టలేదన్నారు. ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం తోడ్పడదన్నారు.

Tags:    

Similar News