ఎస్సీ వర్గీకరణపై మాట్లాడితే మైక్ ఇస్తాం: అసెంబ్లీ స్పీకర్
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ కు తెలిపారు.
దిశ, వెబ్ డెస్క్: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ కు తెలిపారు. దీంతో అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై చర్చ మొదలు పెట్టగా.. బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. బుధవారం బీఆర్ఎస్ మహిళా సభ్యులను అవమానించేలా మాట్లాడిన సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో సభలో తమకు మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదని.. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ సభ్యులు నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని అందరికి మైక్ ఇస్తాం కానీ ఎస్సీ వర్గీకరణపై మాత్రమే మాట్లాడాలని కోరారు. దీంతో వి వాంట్ జస్టిస్ అంటూ బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీలో ఆందోళనకు దిగారు.