తెలంగాణ డీజీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేల మీద జరగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ డీజీపీ(Telangana DGP) జితేందర్ ను గురువారం ఆయన కార్యాలయంలో కలిశారు.

Update: 2024-09-19 10:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేల మీద జరగుతున్న దాడులపై చర్యలు తీసుకోవాలని పలువురు బీఆర్ఎస్ నేతలు తెలంగాణ డీజీపీ(Telangana DGP) జితేందర్ ను గురువారం ఆయన కార్యాలయంలో కలిశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన బీఆర్ఎస్ నాయకులపై దాడులను డీజీపీకి వివరించి, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఖమ్మం జిల్లాలో సంభవించిన వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పరామర్శించడానికి వెళ్లిన పలువురు బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ నాయకులు వారి కార్యకర్తలతో దాడి చేయించారని డీజీపీ ముందు వాపోయారు. అలాగే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీదకు అరికెపూడి గాంధీ దాడికి వెళ్లిన సంఘటనను గుర్తు చేస్తూ.. ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఏముంటుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించాలని బీఆర్ఎస్ నేతలు జగదీష్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితోపాటు పలువురు నాయకులు డీజీపీని కోరారు.  


Similar News