చంద్రబాబు బయటకు రావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షం..
మధ్యంతర బెయిల్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు రావడంపై
దిశ, వెబ్‌డెస్క్: మధ్యంతర బెయిల్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు బయటకు రావడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆనందం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడం మంచి పరిణామమని, అందరూ సంతోషపడాల్సిన విషయమని అరికెపూడి గాంధీ తెలిపారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టారని, అన్ని కేసుల నుంచి త్వరలో చంద్రబాబు బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అటు ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. 53 రోజుల పాటు జైల్లో ఉండి చంద్రబాబు బయటకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. తాను చంద్రబాబు శిష్యుడినని తెలిపారు. కాగా చంద్రబాబు అరెస్ట్‌ను బీఆర్ఎస్లోని చాలామంది ఎమ్మెల్యేలు ఖండించిన విషయం తెలిసిందే.