రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం

రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించాలని ఫిక్స్ అయింది.

Update: 2024-08-17 11:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామస్థాయిలో రుణమాఫీ కానీ రైతుల వివరాలు సేకరించాలని ఫిక్స్ అయింది. ఆ సేకరించిన వివరాలను జిల్లా కలెక్టర్లకు.. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ విషయాన్ని శనివారం తెలంగాణ భవన్ వేదికగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్క రైతుకి రుణమాఫీ అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని అన్నారు.

ప్రతి మంత్రి నియోజకవర్గం నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి నియోజకవర్గం వరకు మొదట వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని తెలిపారు. అప్పటికి కూడా రైతులకు న్యాయం జరగకుంటే ప్రత్యక్ష ఉద్యమానికి శ్రీకారం చుడతామని కీలక ప్రకటన చేశారు. తమ కాల్ సెంటర్‌కి దాదాపు లక్షా 20 వేల ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో కనీసం 40% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ రైతులంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తక్షణమే రైతులందరికీ న్యాయం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News